దేశంలో తాజాగా కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,805 మంది కరోనా బారిన పడగా.. మరో ఆరుగురు వైరస్ కారణంగా మృతిచెందారు.
దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,837కు పెరిగింది. మరోవైపు కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయికి చేరింది. తాజాగా యాక్టివ్ కేసులు 10వేలు దాటాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నేడు కేంద్రం రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించనుంది.