Global Industry Summit 2023: గ్లోబల్ ఇండస్ట్రీ సబ్మిట్ 2023 విశాఖపట్నంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పరిశ్రమంలో మరియు పెట్టుబడులు ఆకర్షించి ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో ఈ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ ఏర్పాటు చేయడం వలన ఏపీలో పెట్టుబడిలో పెట్టడానికి ఏపీతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి.
ఈ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి అత్యంత అనుకూలంగా ఉందని.. భారత దేశంలో గుజరాత్ తర్వాత రెండవ స్థానంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 36 జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలతో ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఒప్పందం చేసుకున్న ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఫోటో, పేటీఎం సంస్థల ద్వారా ప్రచారం చేస్తుంది.
తాజాగా ఈ గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మెట్ పెట్టుబడుల ఆకర్షించడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఆసక్తి ఉన్నటువంటి యువతకి మరియు ప్రతిభ ఉన్నవారికి స్టార్టప్ మొదలు పెట్టడానికి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. దీనివలన ఎంతోమందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నయని తెలుస్తూంది. అలాగే రాష్ట్రంలో ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకొని ముందు ముందు మరిన్ని పెట్టబడులు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో మొత్తానికి రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు భారీగా వుధ్యోగా అవకాశాలు వచె అవకాశం వున్నట్టు బిజినెస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.