గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారంకోసం ..పదవుల కోసం ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరిన విషయం తెల్సిందే .పార్టీ మారే సమయంలో అఖిలప్రియతో పాటుగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో కల్సి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఈ నేపథ్యంలో పార్టీ మారినందుకు చంద్రబాబు తన మంత్రి వర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి సత్కరించాడు .
ఇటీవల రాష్ట్రంలో కృష్ణా నది పరిధిలో జరిగిన బోటు ప్రమాదం కారణంగా దాదాపు ఇరవై రెండు మంది మరణించిన సంగతి తెల్సిందే .దీనిపై ఇంట బయట మంత్రి అఖిలప్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ..సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బోటు ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం .అయితే ఈ సంఘటనకు మంత్రి అఖిలప్రియ భాద్యత వహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు .
దీంతో అవాక్కవడం మంత్రి అఖిల ప్రియ వర్గం వంతైంది .అయితే తనకు అనుభవం లేకపోయిన ఎంతో రాజకీయ అనుభవం ,పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నేతృత్వంలో పని చేయడానికి మంత్రిగా భాద్యతలు స్వీకరిస్తే తాజాగా జరిగిన సంఘటనతో తనను కార్నర్ చేయడం పట్ల అఖిల ఆవేదనను చెందుతున్నారు సమాచారం .ఈ విషయం గురించి తన అనుచరవర్గం దగ్గర పార్టీ మారి తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు .అయితే గతంలో గోదావరి పుష్కరాల్లో చనిపోయిన ముప్పై మందికి పైగా చనిపోయినప్పుడు ఇటు సంబంధిత మంత్రి కానీ అటు ముఖ్యమంత్రి కానీ ఎందుకు భాద్యత వహించలేదని అఖిల ప్రియ అనుచరవర్గం అంటుంది .చూడాలి మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో ..?