Home / ANDHRAPRADESH / రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం.. చంద్రబాబుకు పంచ ప్ర‌శ్న‌లు..?

రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం.. చంద్రబాబుకు పంచ ప్ర‌శ్న‌లు..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ న‌టుడు శివాజీ వేసిన ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చంద్ర‌బాబు పొందు ప‌ర్చిన అంశాల‌ను.. అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ స‌ర్కార్ పూర్తిగా విశ్మ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ విష‌యాల‌న్నిటి పై వైసీపీ ప్ర‌శ్నిస్తూనే ఉంది. అయితే తాజాగా సినీ న‌టుడు శివాజి చంద్ర‌బాబు గారికి వేసిన ఐదు ప్ర‌శ్న‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

1. ఏపీలో అవినీతిని నిర్మూలించారా..?

ఆంద్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత.. ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు స‌ర్కార్ ఏపీని అవినీతి ఆంద్ర‌ప్ర‌దేశ్‌గా తీర్చి దిద్ద‌డానికి సాయ‌శ‌క్తులా కృషి చేస్తోంది. ఏపీలో క‌నీవిని ఎరుగ‌ని రీతిలో టీడీపీ నేతలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారన్నారు. ఏపీలో అవినీతి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉంద‌ని 74.3 శాతం మంది చెప్పారని.. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా ఏపీ ముందువ‌రుస‌లో ఉంద‌ని ఎన్‌సీఏఈఆర్ జ‌రిపిన స‌ర్వేలో లేలిన విష‌యం తెలిసిందే. ఇక అవినితి పై శివాజీ ఏమన్నారంటే.. మా జిల్లాలో ఒక పెద్ద పదవిలో ఉన్న కుమారుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, బడ్డీ కొట్ల దగ్గరనుంచి అధికారుల దాక ఎటు చూసినా.. ఆ వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నారు. వారిపై చర్యలు ఏవి అది మీకు నీతిగా కనిపిస్తుందా అంటూ శివాజీ చంద్రబాబుపై విరుచుకు పడ్డారు..

2. ఏపీ ప్రత్త్యేక హోదా 15 ఏళ్ళు..?

2014 సార్వ‌త్రిక ఎన్నికల ప్రచారంలో.. చంద్ర‌బాబు.. వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసి ప్రధాన మంత్రిని ఒప్పించి పదేళ్లు కాదు పదిహేనేళ్ళు రాష్ట్రానికి ప్రత్త్యేక హోదా ఇవ్వాలి.. ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రము ఎందుకు పనికి రాదని మీరే చెప్పారు.. తీరా అధికారంలోకి వ‌చ్చాక.. ప్ర‌త్యేక హోదా కంటే ప్ర‌త్యే ప్యాకేజే మంచిద‌ని ఊద‌ర‌గొడుతున్నారు. నాడు అధికారం కోసం మీకు న‌చ్చిన‌ట్టు హామీలు ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారు..?

3. కులం కార్డు.. కాపుల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టూ..?

చంద్ర‌బాబు గారు మిమ్మ‌ల్ని కాపు రిజర్వేషన్లు కల్పించండి.. మానిఫెస్టోలో పెట్టండని.. కాపు కులం, కాపు సామజిక వర్గం మొత్తం వచ్చి మిమ్మల్ని అడిగారా..లేదే.. అయినా మీరు మానిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడేమో వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశం ఏదైనా గాని మీరు పెట్టారా లేదా.. మీ మానిఫెస్టోలో పెట్టేముందు బీసీ సంఘాలతో చర్చించారా.. లేదు అయినా మీరు హామీ ఇచ్చారు.. మారి వాటిని నెరవేర్చారా సీయం గారు..?

4 . బాబు వ‌స్తేనే జాబు.. ఎంత‌మందికి..?

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా .. బాబు వ‌స్తేనే జాబు వ‌స్తోంద‌ని.. యువ‌త‌కు గాలం వేయ‌డానికి.. రాష్ట్రంలో ఉన్న గోడలు మొత్తం రాసారు. ఒకవేళ రాకుంటే ప్రతి ఒక్క నిరుద్యోగునికి రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు.. ఇచ్చారా..? ఎప్పుడు ఇచ్చారు.. ఎవరికీ ఇచ్చారు..లెక్కలు బయటికి చెబితే సంతోషిస్తాం.

5. అన్న‌దాత‌ల‌కు రుణ‌మాఫీ చేశారా..?

రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోయాయ‌ని.. నేను అధికారంలోకి వ‌స్తే రైతులంద‌రికి రుణ‌మాఫీ చేస్తాన‌ని చెప్పారు. అస‌లు రైతులు రుణమాఫీ చేయ‌మ‌ని మిమ్మ‌ల్ని అడిగారా.. మీరు మేనిఫెస్టోలో పెట్టారు.. రైతులంద‌రికీ న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌మందికి రుణ‌మాఫీ చేశారు.. మ‌ళ్ళీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌స్తున్నా.. ఇప్ప‌టి వ‌రుకు పూర్తిగా ఎందుకు రుణ‌మాఫీ చేయ‌లేదో చెబితే తెలుసుకుంటాం.. అని శివాజీ ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు పంచ ప్ర‌శ్న‌లు వేశారు. మ‌రి శివాజీ వేసిన ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ నుండి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat