రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్లపై వడ్డీరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ఏడాదికి 8.5% వడ్డీ రేటుతో గృహరుణాలు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. MSME రుణాలు కూడా 8.4% వడ్డీకే ఇస్తామని పేర్కొంది. మార్చి 31 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని BOB వివరించింది.