తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బీజేపీ గవర్నర్లను రిమోట్ తో ఆపరేట్ చేస్తూ బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతోంది.
న్యూట్రల్ గా ఉండాల్సిన గవర్నర్.. చేయాల్సిన పనులు చేయకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. బిల్లులను నొక్కిపెట్టడానికి వారికి హక్కు లేదు. దేశంలో గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పనిచేస్తోంది’ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.