గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వ శాసనమండలి విప్,మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారితో ,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ గారు,NMC గౌరవ ప్రజాప్రతినిధులు,నియోజిక వర్గ గౌరవ ప్రజాప్రతినిధులతో గండి మైసమ్మ చౌరస్తా వద్ద భారీ సంఖ్యలో మహిళలతో కలిసి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా మరియు భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ గారు, మేయర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఆనవాయితీ అయిందని,ఒక పక్క పెరుగుతున్న సిలిండర్ ధరలు,పెట్రోల్ మరియు నిత్యావసరాల ధరలు పేద,మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని,కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ,పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో NMC గౌరవ కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, GHMC కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు,నియోజిక వర్గ గౌరవ ప్రజాప్రతినిధులు, NMC మరియు ఆయా డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల సభ్యులు,యువ నాయకులు మహిళ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.