GANGULA: కరీంనగర్‌లో వాటర్ ఫౌంటైన్ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బాలకిషన్ పాల్గొన్నారు. మానేర్ రివర్ ఫ్రంట్ లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 69 కోట్ల రూపాయలతో వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఫౌంటెన్‌లో ఫైర్, లేజర్, ప్రొజెక్టర్స్ ఉంటాయని వెల్లడించారు.
ఎంతో ఘన చరిత్ర ఉన్న కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అదే కేసీఆర్ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. 40వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రొజెక్టర్ ఉంటుందని…… కిలోమీటరు దూరం వరకు ప్రొజెక్ట్ చేస్తుందని వెల్లడించారు. 100అడుగుల లోతు నుంచి ఈ ఫౌంటెన్ నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 2 నాటికి ఫౌంటెన్ నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్నారు.
దేశంలోనే తొలిసారిగా భారీ ఐలాండ్ ఫౌంటెన్‌ను నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వెయ్యి మంది పర్యాటకుల సామర్థ్యంతో ఆంపీ థియేటర్‌ను నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు.
మానేర్ రివర్ ఫ్రంట్ గొప్ప ప్రాజెక్ట్ అని….. సబర్మతి రివర్ ఫ్రంట్ కన్నా అందంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా విదేశీ పర్యాటకుల కోసం కూడా అతిథి గృహాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా పనులు జరుగుతున్నాయని మంత్రి ప్రస్తావించారు.