Politics : త్వరలోనే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అధికార వైసిపి టిడిపి నేతల మధ్య మాటలు యుద్ధమే నడుస్తుందని చెప్పాలి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు..
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పగటివేషగాడిలా మళ్ళీ వస్తున్నాడని అందరూ జాగ్రత్త పడాలంటూ చెప్పుకొచ్చారు.. మళ్లీ బీసీలకు నమ్మకద్రోహం చేయటానికి చంద్రబాబు సిద్దమయ్యారని, అమలు చేయని హామీలు ఇస్తూ జనంలోకి వస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.
నాయుడు పదవిలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళల నుంచి ఎవరిని వదలకుండా రుణాల విషయంలో మోసం చేశారని అన్నారు రైతు రుణమాఫీ అని చెప్పి నిలువునా దోపిడీ చేశారని ప్రజలను ఆశపెట్టి వారితో అప్పులు చేయించి మోసం చేశారని అన్నారు ఇప్పటికే ఎన్నో విధాలుగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మళ్ళీ ప్రజల్లోకి ఎలా వస్తారంటే ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో రావడానికి సిద్ధమవుతున్నారని కానీ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ప్రభుత్వం పాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని ఇచ్చిన హామీలు అన్నిటిని జగన్ తప్పకుండా నెరవేరుస్తున్నారని చెప్పుకొచ్చారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేరుస్తున్నామని కార్మికుల నుంచి విద్యార్థుల వరకు అందరికీ అన్ని విధాలా చేయూత అందిస్తున్నామని తెలిపారు విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చామని ఇవన్నీ గత ప్రభుత్వ ఎక్కడ చేసిందంటూ ప్రశ్నించారు.