Home / POLITICS / KTR: వెల్ స్పన్ టెక్స్‌టైల్ యూనిట్‌ ప్రారంభించిన కేటీఆర్

KTR: వెల్ స్పన్ టెక్స్‌టైల్ యూనిట్‌ ప్రారంభించిన కేటీఆర్

KTR: రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో వెల్ స్పన్ టెక్స్‌టైల్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సబిత, ఎంపీ రంజిత్‌రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఐదేళ్ల కిందట ఒక్క పరిశ్రమ లేని పరిస్థితి నుంచి మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, కిటెక్స్‌ వంటి కంపెనీలు వచ్చే స్థాయికి ఎదిగామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం ఇక్కడే చందన్ వెల్లిలోనే ఏర్పాటుకానుందని మంత్రి తెలిపారు

బాలకృష్ణ గొయెంక తెలంగాణలో వెల్‌స్పన్‌ సిటీని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆయన గుజరాత్ తో పాటు అమెరికాలోనూ పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు. బుధవారం ప్రారంభించిన పరిశ్రమ యూనిట్‌ను గుజరాత్‌లో కచ్‌లోని ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రణాళిక రూపొందించిందని ఆయనను కలిసి ఇక్కడా పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు తెలిపారు.

కచ్‌లో యూనిట్‌ స్థాపనను విరమించుకుని చందన్‌వెల్లిలో యూనిట్ ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే 2వేలకోట్ల రూపాయలతో 2 యూనిట్లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మరో ఐదు, ఆరేళ్లలో వేలకోట్ల పెట్టబడులు తెలంగాణలో పెట్టేందుకు బాలకృష్ణ గొయెంకా సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. స్థానికంగా ఐటీ యాక్టివిటీ ప్రారంభమైతే యువత హైదరాబాద్‌కు, బెంగళూరుకు వెళ్లనక్కర్లేదనిఆ పరిస్థితి త్వరలో రావాలని మంత్రి ఆకాంక్షించారు.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి చందన్‌వెల్లి వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఐకియాతో వెల్‌స్పన్‌కు ఒప్పందం ఉందని, ఇందులో స్థానిక మహిళలను భాగస్వాములను చేస్తే.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్‌స్పన్ ప్రతినిధులు చెప్పారని మంత్రి స్పష్టం చేశారు.

స్థానికంగా ఉపాధి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి మహిళలు, యువతకు శిక్షణ ఇవ్వాలని అధికారులను సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను శశ్యశ్యామలం చేస్తామని కేటీఆర్ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat