హిండెన్ బర్గ్ నివేదికతో ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ భారీగా నష్టపోయిన సంగతి తెల్సిందే. తాజాగా మరో షాక్ తగిలింది. డీబీ పవర్ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు గడువు ముగియడంతో డీల్ అయింది.
1200 మెగావాట్ల బొగ్గు పవర్ ప్లాంట్ ఉన్న డీబీ పవర్ కంపెనీ నుంచి రూ.7,017 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు అదానీ పవర్ గతేడాది ఒప్పందం చేసుకుంది. డీల్ రద్దు కావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో విస్తరించాలనుకున్న అదానీ ఆశలు ఆవిరయ్యాయి.