చోదకుడి అవసరం లేని కార్ల గురించి వినే ఉంటారు. కానీ డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్‌ను తొలిసారిగా మహీంద్రా అండ్ మహీంద్రా ప్రదర్శించింది. ఇది విపణిలోకి రావడానికి వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందేనట. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. 20 – 100 హెచ్‌పీ శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేస్తామని, ఇవన్నీ విపణిలోకి రావడానికి సమయం పడుతుందని చెప్పింది. ‘ఈ వినూత్న ఉత్పత్తి వ్యవసాయ తీరును మార్చివేస్తుంది. ఉత్పాదకతను పెంచుతుంది. ప్రపంచ అవసరాలకు కావలసిన ఆహార ఉత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుంద’ని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ ట్రాక్టర్‌ను విపణిలోకి దశల వారీగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
స్టీరింగ్‌ను దానంతట అదే తిప్పుకుంటుంది(ఆటో స్టీర్), పొలంలో వరుస లైన్ల అనంతరం తిరిగి పక్క వరుసలోకి వెళ్లుతుంది. అది కూడా ఎటువంటి కమాండ్ ఇవ్వకుండానే(ఆటో హెడ్‌ల్యాండ్ టర్న్), దూరం నుంచే ట్రాక్టర్ ఇంజిన్‌ను స్టార్ చేయవచ్చు. నిలిపివేయవచ్చు.(రిమోట్ ఇంజిన్ స్టార్-స్టాప్)