సినీ నటుడు పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈ మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో కెక్కుతోంది. గత కొద్దిరోజులగా రేణు దేశాయ్ రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో తెగ రచ్చ జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై రేణు చేసిన కామెంట్స్.. మరోసారి సోషల్ మీడియాలోనే కాకుండా సినీ వర్గీయుల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
తెలుగులో ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తోన్న రేణు దేశాయ్ ఈ వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ చరిత్రలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్లో.. ప్రస్తుత జనరేషన్లో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పౌరాణిక డైలాగులు పర్ఫెక్ట్గా చెబుతాడని.. తారక్‌ను ఆకాశానికి ఎత్తేసింది. అంతే కాకుండా.. తారక్ గొప్ప డ్యాన్సర్, చాలా సింపుల్‌గా స్టెప్పులు వేస్తాడని కితాబిచ్చింది. దీంతో తారక్ పై చాలా మంది ప్రశంసలు కురిపించడం కామనే అయినా.., పవన్ మాజీ భార్య అయిన రేణు ఈ రేంజ్లో ప్రశంసలు కురిపించడంతో సినీ జనాల్లో హట్ న్యూస్‌గా మారింది.