Politics ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా తెదేపా ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్పష్టమైన అవగాహన తమకుందని అన్నారు అలాగే.. “సీఎం జగన్‌పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు అమరావతి భూముల ధరలు పెంచుకుని ప్రయోజనం పొందాలనుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి అంశంతో చంద్రబాబు లబ్ధిపొందాలని చూస్తున్నారు. ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగకపోయినా రాద్ధాంతం చేస్తున్నారు. సీఎం జగన్ ప్రజల అవసరాలు తీర్చడంపైనే దృష్టి పెట్టారు.. సీఎంగా ఉండి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారు. అలాగే చంద్రబాబు హయాంలోనే ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్‌లు చేశారు. సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారు. చంద్రబాబు స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారు. అమరావతి డిక్లేర్ చేశాక చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదించలేదు. అప్పటి మంత్రి నారాయణతో కమిటి వేసి వారంలో రాజధాని ప్రకటించారు. అమరావతిని బంగారు గుడ్డుపెట్టే బాతులా మార్చాలనుకున్నారు.. ” అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు..
అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినామీల పేరుతో ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారని కానీ జగన్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ఉన్నారని అన్నారు చంద్రబాబు ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాజధానిని దోచుకున్నారని చెప్పుకొచ్చారు..