Politics దేశంలోనే మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న విశాఖపట్నం అభివృద్ధిలో దూసుకుపోతుంది. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని ప్రకటించడంతో విశాఖకు మరింత క్రేజ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం విశాఖపట్నం పై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది..
తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం పై ఫోకస్ పెంచినట్టు కనిపిస్తుంది. ఎలాగైనా విశాఖ పార్లమెంట్లు తన ఖాతాలో వేసుకోవాలని బిజెపి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.. పక్కగా తనదైన ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత జీవీఎల్ నరసింహా రావు ను అధిష్టానం రంగంలోకి దింపినట్టు సమాచారం. అందుకే..
తాజాగా నరసింహారావు విశాఖకు తన మకాం మార్చారు. అంతేకాకుండా విశాఖలో బిజెపి గెలుపుకు సంబంధించి తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.. వచ్చే ఎన్నికల్లో తానే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. అంతేకాకుండా ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నంలో కాషాయ జెండాను పాతాలని బిజెపి గట్టిగానే నిర్ణయించుకున్నట్టు ఇందుకు ముందు ముందు మరింత ఫోకస్ ను ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆంధ్రాలో అన్ని పార్టీల ఫోకస్ విశాఖపట్నం పైన ఉన్నట్టు కనిపిస్తుంది.. ఇటు అధికార వైసిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం విశాఖపట్నం పై తమదైన పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే మాజీ జెడి లక్ష్మీనారాయణ సైతం విశాఖ నుంచి ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి విశాఖపట్నం పై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది అంతేకాకుండా వీటన్నిటిని దాటి విశాఖపట్నం పై తన పట్టును సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది..