Home / ANDHRAPRADESH / స‌మ‌స్య ఏదైనా.. ఓన్లీ 72 హ‌వ‌ర్స్.. జ‌గ‌న్ రోరింగ్ స్పీచ్‌..!

స‌మ‌స్య ఏదైనా.. ఓన్లీ 72 హ‌వ‌ర్స్.. జ‌గ‌న్ రోరింగ్ స్పీచ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న జ‌గ‌న్‌.. సోమ‌వారం త‌న పాద‌యాత్ర‌లో భాగంగా.. హు సేనాపురంలో వైసీపీ మ‌హిళా స‌ద‌స్సులో.. జ‌గ‌న్ త‌న విశ్వ‌రూపం చూపించారు.

అనేక గ్రామాల్లో ఇళ్లు లేని వారు చాలా మంది ఉన్నారని.. వారంద‌రికీ ఒక‌టే హామీ ఇస్తున్నాని.. గ్రామాల్లో ఇళ్లు లేని వారంద‌రికీ.. సొంత ఇళ్ళు క‌ట్టిస్తామ‌ని.. అందుకోసం ప్ర‌తి గ్రామంలో.. గ్రామ సచివాలయాలను ప్రారంభించి 72 గంట‌ల్లో ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరయ్యేలా చేస్తామని జ‌గ‌న్ మాట ఇచ్చారు.

నిరుపేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామ‌ని.. ప్ర‌తి ఇంట్లో ఇద్దరు బిడ్డలకు సంవత్సరానికి ఒక్కొక్కరికి 15 వేలు ఇస్తామ‌ని చెప్పారు. అంలే కాకుండా.. ఇంజనీరింగ్‌ ఫీజులు షాక్‌ కొడుతున్నాయని.. ఫీజు రీయింబర్స్‌మెంట్లో ప్రభుత్వం కేవలం 35 వేలే ఇస్తోంద‌ని… ఫీజులు ఎంత ఉన్నా స‌రే పూర్తిగా ఇచ్చి మీ పిల్లల్ని చదివిస్తానని హామీ ఇచ్చారు.

ఇక విద్యను అభ్యసిస్తూ హాస్టళ్లలో ఉండటానికి సంవత్సరానికి 20 వేలు ఇస్తామ‌ని.. పెన్షన్‌ను 2 వేలు చేస్తానని హామీ ఇస్తున్నాన‌ని.. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీల పెన్షన్‌ వయసును 45కు తగ్గిస్తాన‌ని అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంద‌ని.. బెల్టు షాపులు రద్దు చేస్తామ‌ని చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల మేనిఫెస్టోలో అన్నారు.. అధికారం లోకి వ‌చ్చి నాలుగేళ్ళు కావొస్తున్నా చంద్ర‌బాబు ఎందుకు రద్దు చేయ‌లేదో.. ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని జగ‌న్ ఫైర్ అయ్యారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat