ఏపీలో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో మహిళ ఉద్యోగులపై లైంగిక వేదింపులు ఎక్కువయ్యాయి .ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా రాష్ట్రంలో తిరుమలేశ్వరుడు ఆస్థానమై ఉన్న తిరుపతి మహానగర పాలక సంస్థ పరిధిలో లైంగిక వేదింపు సంఘటన వెలుగులోకి వచ్చింది సంస్థలోని ఒక ఇంజనీర్ బరితెగించాడు .నడివయస్సులో కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఔట్ సోర్సింగ్ మహిళా కార్మికులను బెదిరిస్తున్నాడు .
సంస్థలో నీటి సరఫరా వ్యవస్థలో పని చేసే అయన ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి .అయితే కార్మికులందరూ ఏకమై సంబంధిత ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు .అయిన అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు .తాజాగా ఒక వితంతువుపై ఇలాంటి బెదిరింపులకు దిగాడు .ఈ క్రమంలో నన్ను ఎప్పుడు పిలుస్తావు .మీ ఇంట్లో బిర్యానీ ఎప్పుడు పెడతావు .పోనీ టిఫెన్ పెడతావు .కనీసం కాపీ ఎప్పుడు ఇస్తావు అని ఇలా డబుల్ మీనింగ్ వర్డ్స్ తో కామంతో మాట్లాడాడు .
దీంతో సదరు మహిళా తన బంధువుల సహకారంతో ఉన్నతాధికారులకు పిర్యాదు చేసింది .ఈ విషయం తెల్సిన సదరు అధికారి ఇంకో అడుగు ముందుకేసి నీ కొడుకు జాబు కావాలన్నా నా కోరిక తీర్చాలి .లేకపోతే ఉన్న నీ జాబు కూడా పీకేస్తా అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు అని సదరు బాధితురాలు వాపోతుంది .అయితే ఎన్ని సార్లు పిర్యాదు చేసిన కానీ ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో అతని దగ్గర మహిళా ఉద్యోగులు పని చేయడానికి భయపడిపోతున్నారు .