తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ అభివృద్ధిపై ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తకు మధ్య సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా వాడీవేడి చర్చ జరిగింది.నగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్‌కు సంబంధించి 2011, 2016 సంవత్సరాల్లో గూగుల్ మ్యాప్స్ నుంచి తీసిన రెండు ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నగరపౌరులకు ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న బొటానికల్ గార్డెన్‌ను 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేట్ సంస్థలకు కట్టబెట్టి నాశనం చేయాలని చూసిందని 2011లో తీసిన ఒక ఫోటోనుపెట్టారు.
Pictures do tell a story! Attached are two pics of Botanical Garden, Kondapur
1st pic from 2011 when the then Cong Govt wanted to privatise & destroy precious urban lungspace
2nd pic is from Nov 2016 which shows how we’ve been able to restore greenery & save the 270 Acre park? pic.twitter.com/TPuxe4pyd0
— KTR (@KTRTRS) November 20, 2017
270 ఎకరాల పార్క్‌ను కాపాడి అందులో పచ్చదనాన్ని పెంపొందించామని పేర్కొంటూ.. గూగుల్ మాప్స్ నుంచి నవంబర్ 2016లో తీసిన మరో ఫోటోని పోస్ట్ చేశారు. ఈ రెండు చిత్రాల్లో 2011లో తీసిన ఫోటోలో చెట్లు చాలా పలుచగా ఉన్నట్టు, 2016లో తీసిన ఫోటోలో చెట్లు దట్టంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.అయితే మంత్రి కేటీఆర్ పెట్టిన పోస్టుపై ప్రియబ్రతా త్రిపాఠి లయ్యర్(అబద్దాలకోరు) అంటూ మండిపడ్డారు. 2012లో ఇదే బొటానికల్ గార్డెన్‌లో ఎన్నో మొక్కలు, పూలను నా కెమెరాతో ఫోటోలు తీశాను. 2016లో తిరిగి అదే గార్డెన్‌కు వెళ్లాను కానీ అప్పుడు బొటానికల్ గార్డెన్ మొత్తం చెత్తగా ఉంది అని పేర్కొన్నారు.దీనికి కేటీఆర్ ట్విట్టర్‌లో బదులిస్తూ.. అయితే గూగుల్ పై కేసు వేయండి సర్, పనిలోపనిగా మీ కెమెరా లెన్స్ కూడా మార్చండి.. అంటూ ఛలోక్తి విసిరారు. స్కామ్‌గ్రెస్‌మెన్ ( స్కాం+ కాంగ్రెస్.. అర్థం వచ్చేలా) నిజాన్ని ఒప్పుకోలేరని పేర్కొన్నారు. లయ్యర్ పదాన్ని వాడినందుకు క్షమించండి అంటూ ప్రియబ్రతా త్రిపాఠి మరో ట్వీట్ చేశారు.
Go ahead and sue Google sir ? and while at it, you may also want to change the lens of your camera
Scamgress men can’t handle the truth https://t.co/Gscfc7f9LD
— KTR (@KTRTRS) November 20, 2017
Sorry for the word, Lair!
By the way sir, how many scamsters from Congress have you prosecuted yet? 🙂 How many Congis you have bought through inducements?
There is an accusation against you personally no! 🙂
Sure, I will visit again. https://t.co/Y4tmhHSwzI
— Priyabrata Tripathy (@PriyabrataT) November 20, 2017
అయితే ఇప్పటి వరకు స్కాముల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ పార్టీ వారిని మీరు ఎంతమందిని విచారించారు. వ్యక్తిగతంగా మీపై ఎలాంటి ఆరోపణలు లేవా అంటూ పోస్ట్ పెట్టారు.మీరు చేస్తున్న మంచి పనికి కృతజ్ఞతలు.అనవసరపు ఆరోణలపై స్పందించకండి సర్ అంటూ ఒక నెటిజన్ కేటీఆర్‌కు సూచించారు. దీనికి స్పందిస్తూ.. స్వాతంత్ర్యం పొంది 70 ఏళ్లుగడిచినా, ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. వీటికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నిరాధారమైన, బాధ్యత లేకుండా చేస్తున్న ఆరోపణలు మాత్రమే ఖండించానని ఆయన తెలిపారు.
Go ahead and sue Google sir ? and while at it, you may also want to change the lens of your camera
Scamgress men can’t handle the truth https://t.co/Gscfc7f9LD
— KTR (@KTRTRS) November 20, 2017