తెలంగాణ రాష్ట్రంలో రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.