SUCIDE: విశాఖ కంచరపాలెం గంగానగర్లో ఇద్దరు కూమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో… పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అప్పుల బాధతోనే పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. ఏడేళ్లుగా కూమార్తెలతో కలిసి ప్రసాద్ అనే వ్యక్తి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి బిందు(13), భార్గవి(15) ఉన్నారు. ప్రసాద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య 2013 లో అనారోగ్యంతో మృతి చెందింది. భార్య చనిపోయినా.. ఏ లోటు లేకుండా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలకు గత ఆరు నెలలుగా పాఠశాలకు పంపించలేదు. అప్పుల బాధ తట్టుకోలేక కూమార్తెలకు ఉరి వేసి అనంతరం ప్రసాద్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలో పెను సంచలనం కలిగించింది.
కాగా.. విశాఖ కంచరపాలెంలోని పాత రామారావు ఆస్పత్రి సమీపంలోని గంగానగర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. చనిపోయిన ముగ్గురే ప్రసాద్ కుటుంబంగా గుర్తించారు. ప్రసాద్ ఫ్యాన్‌కు ఉరేసుకోగా.. బిందుమాధవి, భార్గవి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు. ప్రసాద్ తల్లి అనసూయ.. ఆయన ఇంటికి వచ్చారు. ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో ప్రసాద్ కు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో స్థానికుల సాయంతో 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ముగ్గురూ చనిపోయి ఉండటాన్ని గుర్తించారు.