తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిన్న బుధవారం ఖమ్మం వేదికగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు.
నేటి నుంచి వంద రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16,556 చోట్ల అధికారులు శిబిరాలను ఏర్పాటు చేశారు. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా అన్నిరోజుల్లో కంటి పరీక్షలు చేస్తారు.