Politics టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల కోసం మాట్లాడారు ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడుకుంటూ వచ్చిన కవిత వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అందుకు కారణం ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటూ చెప్పుకొచ్చారు.. సీఎం కేసీఆర్ గన్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అన్నారు..
2023 నూతన సంవత్సరం సందర్భంగా టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఉద్యోగులు, ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు.
అలాగే ప్రపంచం ఎక్కడ చూసినా ఎన్నికల్లో ఏవో గొడవలు జరుగుతున్నాయని కానీ భారతదేశంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండటానికి కారణం ఉద్యోగుల ఉపాధ్యాయులు అంటూ చెప్పుకొచ్చారు.. అలాగే ఉద్యోగులు ఎంత కష్టపడి పని చేయబట్టే దేశం ముందుకు నడుస్తుందని అన్నారు.. అలాగే ఉద్యోగులతో కెసిఆర్ కు ఉన్నది తల్లి పేగు బంధం అన్నారు..తెలంగాణ విముక్తి కోసం ఉద్యోగులు నాడు ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు కవిత.. అలాగే దేశం మొత్తం తెలంగాణ మోడల్ వైపే చూస్తుందని.. అందుకు కారణం ఉద్యోగులే అని అన్నారు.. అంతే కాకుండా తెలంగాణ అభివృద్ధిలో, సాధిస్తున్న ప్రగతి లో ఉద్యోగుల పాత్ర ఉందన్న కవిత బీహెచ్ఈఎల్, సింగరేణి వంటివి బతికింది తెలంగాణ వల్లనేనని అభిప్రాయపడ్డారు.