శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముంబై భామ తమన్నా. మెస్మరైజింగ్ స్కిన్ టోన్‌తో మిల్కీ బ్యూటీగా మారిపోయింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎవరూ ఊహించని వ్యక్తితో జరుపుకుంది. ఆ వ్యక్తితో పార్టీ మూడ్‌లో చాలా క్లోజ్‌గా ఛిల్ అవుతున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ అతడితో డేటింగ్లో ఉందా..? అంటూ చర్చిం చుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్.
ఇంతకీ అతడెవరనుకుంటున్నారా..? హైదరాబాదీ యాక్టర్ విజయ్ వర్మ. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ చిత్రంలో విలన్‌గా మెరిశాడు విజయ్ వర్మ. బాఘీ 3, డార్లింగ్స్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కీ రోల్స్ లో నటించాడు. గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో విజయ్వర్మను తమన్నా హగ్ చేసుకోవడం, అతడితో కలిసి డ్యాన్స్ చేయడం, ముద్దుపెట్టుకోవడం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
