వరంగల్ నగరంలో పలు అభివృద్ది పనుల శంకుస్థాపన కోసం ఐటీ&పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ నగరంలో పర్యటించారు.ఈ సందర్బంగా శంకుస్థాపనల అనంతరం కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ కార్యకరమంలో మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ .. మంత్రి కేటీఆర్ గారు యువతకు మార్గదర్శకుడని,యువత అతన్ని మార్గదర్శకంగా తీసుకోవాలని తెలిపారు.ఉన్నత చదువు చదివి ఉన్నత ఉద్యోగంలో ఉన్నా తెలంగాణా ఉద్యమం కోసం అన్నీ పక్కనెట్టి తెలంగాణా ఉద్యమంలో బాగస్వామ్యుడు మాలాంటి వారిని ముందుండి నడిపి నాడు ఉద్యమంలో ,నేడు పుణర్నిర్మాణంలో మాకు మార్గదర్శకుడుగా నిలిచాడని మేయర్ నరేందర్ అన్నారు.వరంగల్ మహానగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉందని,నగర అభివృద్ది పట్ల నిరంతరం శ్రద్ద వహిస్తూ అడిగినన్ని నిదులిస్తూ మమ్ముల నడిపిస్తున్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని మేయర్ నరేందర్ తెలిపారు.పశ్చిమ నియోజకవర్గాన్ని అన్నివిదాలా వినయ్ భాస్కర్ గారు అభివృద్ది చేస్తున్నారని,ప్రజల ఆశీర్వాదంతో ఆయన ముందుకెలుతున్నారని,కేసీఆర్ గారి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ది కోసం మరింత కృషిచేయనున్నారని తెలిపారు.అభివృద్ది చెందుతున్న నగరం,హైదరాబాద్ తర్వాత రెండవ పెద్దనగరం,చారిత్రక సంపద కలిగిన వరంగల్ నగర దిశా,దశా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి కేటీఆర్ గారు,ఉపముఖ్యమంత్రి శ్రీహరిగారు,ఎమ్మెల్యేలు,ఎంపీ,ప్రజాప్రతినిదులంతా కృషిచేస్తున్నారని,ఈ నగరాన్ని దేశంలోనే గొప్పనగరంగా తీర్చిదిద్దేందుకు మాకు మంత్రి కేటీఆర్ గారు దిశా నిర్దేశం చేస్తున్నారని మేయర్ నరేందర్ తెలిపారు.