ఏపీలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్ విడుదలైంది. కర్నూల్ జిల్లాలోని బనగానలపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల మండలం సౌందరదిన్నె నుంచి ఆదివారం ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 8.30 గంటలకు ఆయన ఆమదాల క్రాస్ రోడ్డు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు బనగానలపల్లి మండలం గులాంనబీ పేట-బొండల దిన్నెక్రాస్ రోడ్‌కు చేరుకొని.. అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగిస్తూ ఉదయం 11.30 గంటలకు ఎల్లురి కొత్తపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు వైఎస్ జగన్ భోజనం విరామం తీసుకుంటారు.
తిరిగి ఎల్లురి కొత్తపేట శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటలకు బనగానలపల్లి చేరుకొని.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్ జగన్ బస చేస్తారు.