Politics తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా పేరు మార్చుకొని దేశవ్యాప్తంగా తన కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధమవుతుంది.. అయితే ఈ పార్టీతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఏకచక్రంగా తన గుప్పెట ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్.. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బాగా అధికారం నుంచి దించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భాజపాను గద్దెనించాలని తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకోసం ఇప్పటికే తెరాస పార్టీని జాతీయ స్థాయి పార్టీగా మార్చడమే కాకుండా వీలైనన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తున్నారు.. అయితే బీఆర్ఎస్ సభ ను ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంసంగా మారింది
అయితే తాజాగా దేశ రాజధానిలో బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం కూడా ప్రారంభమైంది.. అలాగే అక్కడ బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా తమ మొదటి ప్రాధాన్యత రైతులకు ఇస్తామంటూ కూడా కేసీఆర్ స్పష్టం చేసేసారు.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీలైనంత తొందరగా జనాల్లోకి తీసుకెళ్లడానికి తొలి సభను భారీగానే నిర్వహించాలని అనుకుంటున్నారంట.. ఈ సభను ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంసంగా మారింది దీనిపై ఇప్పటికే పలు వాదనలు వినిపిస్తూ ఉండగా మొదటి సభను రామ్ లీలా మైదానంలో నిర్వహిస్తారని ప్రచారం జరిగింది అయితే ఇలా కాకుండా మహారాష్ట్ర వేదికగా అమరావతిలో నిర్వహించడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది..