politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడు బడ్డుకొండ మనిదీప్ వివాహానికు హాజరయ్యారు.. విజయనగరం దాకమర్రి జంక్షన్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు స్నేహ, మణిదీప్లను ఆశీర్వదించారు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పెద్ద కుమారుడు వివాహం భీమునిపట్నం మండలం దాకమర్రిలో జరిగింది అయితే ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు అలాగే నూతన వధూవరులను ఆశీర్వదించారు…ఈ కార్యక్రమం కోసం జగన్ ఈరోజు జరగబోయే పనులన్నీ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఈ వివాహానికి సీఎం జగన్ వెంట ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు..
విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన బడ్డు కొండ అప్పలనాయుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు అలాగే అంచలంచలుగా ఎదుగుతూ..బడ్డుకొండ అప్పలనాయుడు 2009 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. 2014 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడు చేతిలో ఓడిపోయారు. 2019లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం నుండి రెండవసారి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు..