Political ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ ఏకమైతే మంచిదంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే విషయంపై తెలంగాణ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఒకవేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసిపోయే పరిస్థితి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని అన్నారు రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే అందులో తప్పేముందన్నారు.. అప్పట్లో రాష్ట్రం విడిపోయినప్పుడు తానంతో బాధపడ్డామని మళ్లీ కలిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు దీనినీ విచిత్రంగా చూడాల్సిన అవసరం ఏమీ లేదని.. ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రాలు కొన్ని పరిస్థితుల వల్ల విడిపోయాయి మళ్ళీ ఏకమైతే సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు అలాగే రెండు రాష్ట్రాలు ఎప్పుడు కలిసే ఉండాలని తన కోరుకుంటామని అలాగే జరిగితే వాటి అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తామని అన్నారు.. అలాగే సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు సత్యనారాయణ.. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుకు మాటలు తప్ప చేతలు లేవన్నారు.