తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మొదలైన మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన నాటి ఉద్యమ దళపతి.. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే.
ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. చరిత్రను మలుపుతిప్పిన నవంబర్ 29తేదీ చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుందని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.‘మీ పోరాటం అనితర సాధ్యం.
ఒక నవశకానికి నాంది పలికిన రోజు. ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు. చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29, 2009. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు ఇది. దీక్షా దివస్ #DeekshaDivas’ అని ఆయన ట్వీట్ చేశారు.
మీ పోరాటం అనితర సాధ్యం 🙏
ఒక నవశకానికి నాంది పలికిన రోజు
ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు
తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు
చరిత్రను మలుపు తిప్పిన రోజు 29th Nov, 2009. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు
దీక్షా దివస్ #DeekshaDivas pic.twitter.com/ehzGByfGAp
— KTR (@KTRTRS) November 29, 2022