ఏపీలో ఇటీవల కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో జరిగిన ఘోర బోటు ప్రమాదం మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .తాజాగా ఆ సంఘటన మరిచిపోకముందే కృష్ణా నదిలో నిన్న శుక్రవారం మరో పడవ బోల్తా కొట్టింది.
ఈ సంఘటన రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద జరిగింది. నదిలో నుంచి ఇసుక తీసుకొస్తుండగా పడవ మునిగి పోయింది. అయితే ప్రమాదాన్ని ముందే గ్రహించిన పడవలోని కార్మికులు అందరు నదిలోకి దూకేశారు. దీంతో కార్మికులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
టీడీపీ అధినేత ,రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసానికి అతి సమీపంలో ఈ బోటు ప్రమాదం జరిగినట్టు సమాచారం .. ఇటీవల కృష్ణా నది పవిత్ర సంగమం చేరువలో పడవ బోల్తా పడిన ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం అనుమతి లేకుండా బోటు నడుపుతున్న నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెల్పిన కానీ తాజా సంఘటనతో ఫలితం శూన్యమని అర్ధమవుతుంది .