Cm Ys Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష (రీసర్వే) పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 నుంచి 12.55 వరకు బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇటీవలే నర్సాపురం పర్యటనలో 3 వేల కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన చుట్టూ రాజకీయ వేడి కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే బాబు పర్యటనలో ఉన్నప్పుడే మూడు రాజధానుల పేరుతో ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు మరో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది. చంద్రబాబు పర్యటించిన ప్రాంతాలు, రోడ్ షో, సభలు నిర్వహించిన ప్రాంతాలు అపవిత్రం అయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది.
అంతే కాకుండా అక్కడ శుద్ధి చేస్తూ నిరసన చేపట్టింది. బాబు రోడ్ షో నిర్వహించిన ప్రాంతాల్లో కరవు, కాటకాలు రాకుండా పంటలు ఎండి పోకుండా కాపాడాలి అంటూ దేవుడిని వేడుకున్నారు. సభ జరిగిన ప్రాంతాన్ని గోమూత్రము, ఆవుపేడ చల్లి శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.