తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల చల్గల్ పండ్ల మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై విన్నవించేందుకు ఇవాళ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు.
ఇటీవల లక్ష చదరపు అడుగుల్లో నిర్మించిన మామిడి, వ్యవసాయ మార్కెట్లో సీసీ రోడ్లు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి వాలంటరీ ద్వారా 10 ఎకరాల భూమి కేటాయించారని, అయినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలనీ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు