Home / CRIME / జుట్టు ఊడిపోతోందని యువకుడి సూసైడ్!

జుట్టు ఊడిపోతోందని యువకుడి సూసైడ్!

కేరళలోని ఉత్తర్ కన్నూర్‌లో దారుణం జరిగింది. జుట్టు ఊడిపోతోందని మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఓ క్లినిక్‌లో మందులు వాడడంతో కనుబొమ్మలపైనా ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోవడంతో యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయమై మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఉత్తర కన్నూర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రశాంత్ జుట్టు ఊడిపోతుందని 2014లో కొజికోడ్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌ను ఆశ్రయించాడు. అప్పటి నుంచి జుట్టు రాలకుండా ఉండేందుకు అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో డాక్టర్ ఇచ్చిన మందులు వాడడంతో హెయిర్ ఫాల్ తగ్గించడం ఏమో కానీ ఉన్న హెయిర్ కూడా ఊడిపోవడం ప్రారంభమైంది. చివరకు కనుబొమ్మల మీద ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోసాగాయి. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అక్టోబరు 1న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాకుండా తనకు వైద్యం వికటించడం వల్లే సూసైడ్ చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో ఉంది. ప్రశాంత్ మృతికి కారణమైన ఆ క్లినిక్ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat