అలనాటి దివంగత అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘మిలీ’ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.
కాగా, ఈ బాలీవుడ్ బ్యూటీ తాజాగా అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు ఒక వార్త బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.ముంబై బాంద్రా ప్రాంతంలో రూ.65 కోట్లతో ఓ డూప్లెక్స్ హౌస్‌ను కొనుగోలు చేసిందట జాన్వీ. తన తండ్రి బోనీ కపూర్, చెల్లి ఖుషీ కపూర్‌తో కలిసి ఈ ఇంటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
బాంద్రా వెస్ట్‌లోని యూనియన్ పార్క్ రోడ్డులో గల పాలిహిల్‌లో కుబెలిస్క్ బిల్డింగ్‌లో 101, 102 అపార్ట్మెంట్లో మొదటి, రెండో అంతస్తులో ఈ డూప్లెక్స్ నిర్మించారట. ఓపెన్ గార్డెన్, స్విమ్మింగ్ ఫూల్, ఐదు కార్లు పార్క్ చేసుకునేందుకు వీలుగా ఈ ఇంటిని నిర్మించినట్లు సమాచారం. 2022 అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.