తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని ఈనెల 12వతేదీన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమైన సీఎస్… ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుసార్లు తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు.. సీఎం స్థాయిలో కేసీఆర్ పాల్గొనలేదు. అందుకు కారణాలు కూడా కేసీఆర్ వివరించారు. తాజాగా జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్… ఈ నేపథ్యంలో మోదీని కలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.