తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.తన పిల్లల్ని పాఠశాల నుంచి తీసుకొస్తున్న సమయంలో నటి రంభ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు..
ఆమె కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని రంభ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను షేర్ చేసింది.‘‘పిల్లలను పాఠశాల నుంచి తీసుకువస్తుండగా.. దారి మధ్యలో మా కారును మరో కారు ఢీ కొట్టింది.
ఆ సమయంలో కారులో నాతోపాటు పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేం అందరం సేఫ్‌గా ఉన్నాం. చిన్నారి షాషా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాకు బ్యాడ్‌టైమ్ నడుస్తోందనుకుంటా. షాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అంటూ పోస్టు చేశారు.