మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. అన్ని పార్టీలు ప్రచారంలో టాప్గేర్కు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. చండూరులోని బంగారిగెడ్డ వద్ద ఆదివారం జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ జరగనుంది. నియోజకవర్గం వ్యాప్తంగా సభకు కార్యకర్తలను తరలించేందుకు టీఆర్ఎస్నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన నేపథ్యంలో ఆ అంశంపై ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించే సభలో కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో బీజేపీకి ఆయన కౌంటర్ ఇచ్చే అవకాశముంది. దేశవ్యాప్తంగా బీజేపీ యేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఆ పార్టీ చేసిన కుట్రలను కేసీఆర్ ఎండగట్టే వీలుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.