ఉప్పల్ జంక్షన్.. నిత్యం అత్యంత రద్దీగా ఉంటే ఏరియా. ఇక్కడి ట్రాఫిక్‌లో అటు నుంచి ఇటు వెళ్లేందుకు రోడ్ క్రాస్ చేయాలంటే పాదచారులకు పెద్ద గండమే. ఇందుకు చాలా సమయం కూడా వృథా అవుతుంది. పాదచారుల సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రూ.25 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ హంగులతో స్కై వాక్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ స్కైవాక్ తుది దశకు చేరుకుంది. కొత్త ఏడాదికి ఈ స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ స్కైవాక్ ఇప్పటికే అందుబాటులోకీ రావాల్సింది. కానీ కరోనా కారణంగా రెండేళ్లు పనులకు ఆటకం ఏర్పడింది.
ఈ స్కైవాక్‌ను ఉపయోగించి ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్లను చేరుకోవచ్చు. ఉప్పల్ జంక్షన్ నాలుగువైపుల నుంచి మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా మార్గాలను ఏర్పాటుచేశారు. దీన్ని ఉపయోగించి ఎక్కడ రోడ్డు దాటాల్సిన అవసరం లేదు. మెట్లు ఎక్కలేని వారు, వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్స్లకు ఇబ్బంది లేకుండా స్కైవాక్ చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.