ఝార్ఖండ్‌లోని చాయీబాసా ప్రాంతంలో దారుణం జరిగింది. ఫ్రెండ్‌తో సరదాగా బయటకు వెళ్లిన ఓ యువతిపై 10 యువకులు అత్యాచారం చేశారు. ఆపస్మారక స్థితిలోకి చేరుకున్న యువతి తేరుకొని కుటుంబ సభ్యులకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోన్న యువతి ప్రస్తుతం ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తుంది. గురువారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి స్కూటీపై చాయీబాసా శివారులోని ఎయిర్పోర్ట్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా 10 మంది యువకులు వచ్చి ఆమె ఫ్రెండ్‌ను చితకబాదారు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకోగా ఆమె పర్సు, ఫోను తీసుకొని పారిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు విషయం ఇంట్లో వారికి చెప్పింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 12 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.