తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నిక వచ్చినా 40వేల మెజార్టీతో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలువడం ఖాయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు. టీఆర్‌ఎస్ గెలుస్తుందనే సంకేతాల నేపథ్యంలో రాజీనామాపై రేవంత్‌రెడ్డి వెనుకడుగు వేశారని తెలిపారు. రేవంత్‌ది మొదటి నుంచి మోసపూరిత వైఖరేనన్నారు. టీడీపీలో ఉన్నప్పుడే తమను కాంగ్రెస్‌కు బేరం పెట్టాలని ప్రయత్నించారని, ఆయన తీరును గమనించే తాము టీఆర్‌ఎస్‌లో చేరామన్నారు.