నంది అవార్డులు-విమర్శలపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి స్పందించారు .వరంగల్ మార్కెట్ యార్డ్ లో తన కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసం ఆయన గురువారం అసెంబ్లీకి వచ్చారు. అనంతరం నంది అవార్డులు-విమర్శలపై అయన మీడియాతో మాట్లాడుతూ …రుద్రమదేవి చిత్రానికి అవార్డు రావాల్సింది. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర ఎలాంటిదో.. తెలుగు జాతికి రుద్రమదేవి అలాంటిది. అయినా ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు అవార్డులు ఇవ్వటం ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. సాంకేతికంగా, వినోదపరంగా బాహుబలి చిత్రం తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లిందన్న ఆయన… అందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అన్నారు. చారిత్రక నేపథ్యంల, కుటుంబ చిత్రాలను కూడా ఆదరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.