ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. అంతేకాదు వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు.
ఇక పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గనేష్ స్పందిస్దూ ఇవి నంది అవార్డులు కావు, సైకిల్ అవార్డులంటూ వ్యాఖ్యానించాడు. చారిత్రక నేపద్యంతో తీసిన రుద్రమదేవి సినిమాకు అవార్డు రాకపోవడంపై ఆ చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఈ నేపద్యంలో నంది అవార్డుల పై జరుగుతున్న రచ్చ పై సినీ క్రిటిక్ మహేశ్ కత్తి ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు.
కమ్మోళ్ళ రాజ్యంలో కాపులకు ఎందుకండి అవార్డులు.. మీ కాపు సామ్రాజ్యం పవన్ కళ్యాణ్ తెచ్చేదాకా ఆగలేరా.. మెగా ఫ్యామిలికి అప్పుడు పంచుకొండి పప్పులు బెల్లాలు అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అంటూ సాగిన వార్ ను ఈయన కాస్తా కమ్మ- కాపులు అంటూ సామాజిక వర్గాలకు ముడిపెట్టాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.