రజనీ కాంత్ .. ఈ పేరు విన్న ..ఈ కటౌటు చూసిన కానీ ఇటు తెలుగు అటు తమిళంతో పాటు దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు ఏదో తెలియని మైకంలో మునిగి తేలుతుంటారు. రజనీకాంత్ మూవీ విజయపజయాలతో సంబంధం లేకుండా అగ్రస్థానంలో కొనసాగుతున్న సూపర్ స్టార్ అని విమర్శకులు సైతం ఒప్పుకునే పచ్చి నిజం.
అయితే గత సంవత్సరంలో విడుదలైన పెద్దన్న మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ ప్రస్తుతం జైలర్ చిత్రంలో నటిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇది ఇలాగ ఉండగా రజనీ మరో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ జెండా ఊపినట్లు తెలుస్తోంది.
ఆయనతో ఇప్పటికే 2.0,దర్భార్ చిత్రాలను తీసిన లైకా ప్రోడక్షన్స్ నిర్మాణంలో ఈ తాజా రెండు చిత్రాల్లో నటించడానికి ఒకే చెప్పాడని తమిళ ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డాన్ చిత్ర దర్శకుడు శిబి చక్రవర్తి ఇందులో ఒక చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని కోలీవుడ్ లో వార్తలు ..హిట్లు లేకపోయిన కానీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రజనీకాంత్ అందుకే సూపర్ స్టార్ అని సినీ క్రిటిక్స్ అంటున్నారు.