ఇవాళ శాసనసభలో గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలపై చర్చ జరుగుతోంది. నల్లగొండ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు ఇస్తూ… సమైక్య రాష్ట్రంలో మేం ఏమీ చేయలేకపోయినమని, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వెంకట్‌రెడ్డి ఒప్పుకున్నారు. రాత్రికి రాత్రే బంగారు తెలంగాణ సాధ్యమైతదా అని సీఎం ప్రశ్నించారు. మీ హయాంలోనే బాత్రూంలు, ఫ్యాన్లు లేకుండా హాస్టళ్లు నడిపారని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీని భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్ పార్టీ.మహిళల కోసం మొత్తం 30 గురుకుల కాలేజీలు ఏర్పాటు చేసినం. నిర్మాణాత్మక సలహా ఇవ్వండి స్వీకరిస్తామని తేల్చి చెప్పారు. గురుకుల పాఠశాలలకు 2027 నాటికి 8వేల 700 కోట్ల ఖర్చు అవుతుందని వివరించారు. బంగారు తెలంగాణ దిశగా వెళ్తున్నాం… మీకు కనబడకుంటే మేము ఏం చేస్తామని పేర్కొన్నారు. కారుచీకట్ల తెలంగాణను వెలుగులమయం చేసింది నిజం కాదా అని సీఎం ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు.