రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, భవనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణ పేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
