ప్రధానమంత్రి నరేందర్ మోదీ రేపు సెప్టెంబర్ పదిహేడో తారీఖున పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో ఆ రాష్ట్ర బీజేపీ శాఖ నేతృత్వంలో రేపు గోల్డ్ రింగులు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని RSRM హాస్పిటల్లో రేపు జన్మించే శిశువులకు 2 గ్రాముల చొప్పున రింగులు అందజేయనుంది.
సుమారు 10-15 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మోదీ 72వ వడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ నియోజకవర్గంలో 720 కేజీల చేపలు పంపిణీ చేయాలని కూడా బీజేపీ నిర్ణయించింది.