ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికుమార్ అనే యువకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
గతంలో పూరీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేశాడు. గత కొంతకాలంగా అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సాయి కుమార్.. ఇటీవల హైదరాబాద్‌లోని దుర్గంచెరువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.