వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదో రోజు షెడ్యూల్ విడుదలైంది.పదో రోజు పాదయాత్రలో భాగంగా ఉదయం 8గంటలకు ఆళ్లగడ్డలో పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8.30లకు పెద్ద చింతకుంట చేరుకుంటారు. అక్కడ నుంచి దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది.మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం విరామం. అనంతరం 3 గంటలకు కొండాపురంలో పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు దొర్నపాడు మండల కేంద్రం చేరుకొని పార్టీ జెండా ఎగురవేస్తారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ బస చేస్తారు.