పంజాబ్ కు చెందిన కమల్జీత్(21) స్థానిక ఏజెంట్ ద్వారా ఆగస్టులో పనికోసం ఒమన్ దేశం వెళ్లింది. అక్కడి ఏజెంట్ ఆమె పాస్ పోర్టు, ఫోన్ లాక్కున్నాడు. ఈమెచేత బురఖాను ధరింపజేసి, అరబిక్ నేర్చుకోవాలని బెదిరించారు. అతికష్టంమీద తండ్రికి ఫోన్ చేసి మోసపోయిన విషయాన్ని చెప్పింది. స్థానిక ఆప్ నేతల ద్వారా విషయం తెలుసుకున్న MP హర్భజన్ సింగ్ ఒమన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెను కాపాడాడు. తాజాగా ఇంటికి చేరుకుంది.
