దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సందడి షురూ అయ్యింది. ఈ భారీ పంచముఖ మహాలక్ష్మీ విగ్నేశ్వరుడుకి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 50 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. జూన్ 10 నుంచి 150 మంది కళాకారులు 80 రోజులు కష్టపడి ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు క్యూకడుతున్నారు.